India bans Pakistani YouTube channels: 16 పాకిస్థాన్ యూట్యూబ్ చానళ్లను నిషేధించిన భారత్

16 Pakistani YouTube Channels Banned by India
  • భారత్‌‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానళ్లు
  • డాన్, జియో న్యూస్ వంటి ప్రముఖ యూట్యూబ్ న్యూస్ చానళ్లపై నిషేధం
  • వీటన్నింటికీ కలిపి 6.3 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటున్న భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోంమంత్రిత్వశాఖ సిఫార్సులతో పాకిస్థాన్‌కు చెందిన 16 యూట్యూబ్ చానళ్లను నిషేధించింది. వీటిలో డాన్, సామా టీవీ, ఏఆర్‌వై న్యూస్, జియో న్యూస్, రాజీ నామా, జీఎన్ఎన్, ఇర్షాద్ భట్టి, ఆస్మా షిరాజీ, ఉమర్ చీమా, మునీబ్ ఫరూఖ్, బోల్ న్యూస్, రాఫ్తార్, సునో న్యూస్, పాకిస్థాన్ రిఫరెన్స్, సామా స్పోర్ట్స్, ఉజైర్ క్రికెట్ వంటి చానళ్లు ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి మొత్తం 6.3 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

పహల్గామ్ దాడి తర్వాత ఈ చానళ్లు భారత్‌పై విషం కక్కుతున్నాయని, రెచ్చగొట్టేలా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయన్న కారణంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పహల్గామ్ లో 25 మంది పర్యాటకులు, ఒక కశ్మీరీని ఉగ్రవాదులు కాల్చి చంపిన తర్వాత.. భారతదేశం, దాని సైన్యం, భద్రతా సంస్థలను రెచ్చగొట్టేలా ఇవి వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అలాగే, సున్నితమైన కంటెంట్‌పై తప్పుదారి పట్టించే కథనాలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వాటిని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.
India bans Pakistani YouTube channels
Pakistan YouTube channels banned
Pakistani news channels
Anti-India propaganda
Pulwama attack
YouTube censorship
Geo News
Dawn News
India-Pakistan relations
Fake news

More Telugu News