Kriti Devi: ముగ్గురు పిల్లల తల్లి.. బాలికను పెళ్లి చేసుకుని పరార్!

Mother of Three Elopes with Minor Girl in Bihar
  • బీహార్‌లోని దర్భాంగాలో ఘటన
  • బాలికతో ఫోన్‌ ద్వారా పరిచయం
  • విషయం తెలిసి భార్యను హెచ్చరించిన భర్త
  • భర్తనైనా వదులుకుంటాను కానీ, బాలికను వదల్లేనన్న భార్య
  • ఈ నెల 6న బాలిక అదృశ్యం
  • శనివారం ముగ్గురినీ అరెస్ట్ చేసిన పోలీసులు
  • జంటను రిమాండ్‌కు పంపిన కోర్టు.. బాలిక ఇంటికి
బీహార్‌లోని దర్బాంగాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లల తల్లయిన ఓ మహిళ బాలికను పెళ్లి చేసుకుని పరారైంది. ఆమెను కృతీదేవిగా గుర్తించారు. పటాహీ గ్రామానికి చెందిన బాలికతో ఫోన్‌ ద్వారా ఏర్పడిన పరిచయం ఇద్దరి మధ్య అనుబంధానికి కారణమైంది. కృతీదేవి, ఆమె భర్త కృష్ణ మాంఝీ, బాలిక ముగ్గురూ ఓ గదిలో అభ్యంతకరంగా ఉండగా కనుగొన్నట్టు పోలీసులు చెప్పారు. 

కృతి, కృష్ణ 11 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. కృష్ణ రాజస్థాన్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. తన భార్య తరచూ బాలికతో మాట్లాడుతుండటంతో తాను వారించానని అయినప్పటికీ వినిపించుకోలేదని, అవసరమైతే తనను విడిచి వెళ్లిపోతాను కానీ, తన గాళ్ ఫ్రెండ్‌ను విడిచిపెట్టే ప్రసక్తే లేదని తనను బెదిరించిందని కృష్ణ పోలీసులకు తెలిపాడు. 

ఈ క్రమంలో ఈ నెల 6న బాలిక అదృశ్యమైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. బాలికను వివాహం చేసుకున్న కృతీదేవి ఆమెను రాజస్థాన్ తీసుకెళ్లింది. విషయం తెలిసిన కృతీదేవి భర్త కృష్ణ ఆమెపై చేయిచేసుకున్నాడు. అయితే, బాలికతో ఆమెకు ఉన్న సంబంధాన్ని మాత్రం తెంచలేకపోయాడు. 

కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం ముగ్గురినీ అరెస్ట్ చేశారు. కృతి, కృష్ణను కోర్టు జుడీషియల్ కస్టడీకి పంపగా, బాలికకు వైద్య పరీక్షల అనంతరం పోలీసులు ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాలిక కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కృతిని తాము నమ్మామని, ఆమె తమ కుమార్తెను మరదలుగా చెప్పేదని గుర్తు చేసుకున్నారు. అయితే, వారి మధ్యనున్న సంబంధం వెలుగులోకి వచ్చాక నిర్ఘాంతపోయామని పేర్కొన్నారు. భారతీయ చట్టాల ప్రకారం మైనర్‌ను పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్ధం కావడంతో బాల్య వివాహాల నిషేధిత చట్టం, పోక్సో చట్టం కింద కృతిపై చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు.  
Kriti Devi
Child Marriage
Bihar Crime
Darbhanga
Rajasthan
Minor Girl
Krishn Manjhi
Pocso Act
Indian Penal Code
Illegal Marriage

More Telugu News