Siddaramaiah: పాక్ తో యుద్ధం వద్దన్న సిద్ధరామయ్య... యెడియూరప్ప ఫైర్

Siddaramaiahs Anti War Stance Sparks Political Firestorm
  • కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు
  • సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటన్న యెడియూరప్ప
  • సిద్ధరామయ్య దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్
పాకిస్తాన్‌తో యుద్ధం వద్దంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలు 'పిల్ల చేష్టల' మాదిరిగా ఉన్నాయని యెడియూరప్ప విమర్శించారు. దేశమంతా ఐక్యంగా ఉండాల్సిన సమయంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన పదవికే అవమానకరమని, వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని యెడియూరప్ప డిమాండ్ చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర కూడా ఘాటుగా స్పందించారు. మైనారిటీల కోసమే సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా, ముఖ్యంగా కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో, సిద్ధరామయ్య వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమని, క్షమించరానివని అన్నారు. భారతదేశం ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదని, కానీ దేశాన్ని రక్షించుకోవాల్సి వస్తే వెనకాడదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలకు గాను దేశానికి క్షమాపణ చెప్పాలని విజయేంద్ర పునరుద్ఘాటించారు.


Siddaramaiah
Yediyurappa
Karnataka Politics
India-Pakistan War
BJP
Political Controversy
Kashmir Attack
Siddharamaiah statement
War Remarks
Karnataka CM

More Telugu News