Punjab Kings: ఓపెనర్ల ఊచకోత... పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు

Punjab Kings Explosive Opening Partnership Fuels Massive Score Against KKR
  • ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ × కోల్ కతా నైట్ రైడర్స్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
  • నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 201 పరుగులు
  • తొలి వికెట్ కు 120 పరుగులు జోడించిన ప్రియాన్ష్, ప్రభ్ సిమ్రన్
కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్... నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 201 పరుగులు చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్ లో హైలైట్ అంటే ఓపెనర్ల ఆట గురించే చెప్పుకోవాలి.

 యువ ఆటగాడు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ తొలి వికెట్ కు 120 పరుగులు జోడించి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ అర్ధసెంచరీలతో చెలరేగడం విశేషం. ప్రియాన్ష్, ప్రభ్ సిమ్రన్ ధాటికి కోల్ కతా బౌలర్లు కకావికలం అయ్యారు. వీరిద్దరూ ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు బాది స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. 

ప్రభ్ సిమ్రన్ 49 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 83 పరుగులు చేయగా... ప్రియాన్ష్ ఆర్య 35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులతో 69 పరుగులు చేశాడు. వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 16 బంతుల్లో 25 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. గ్లెన్ మ్యాక్స్ వెల్ 7, మార్కో యన్సెన్ 3, జోష్ ఇంగ్లిస్ 11 (నాటౌట్) పరుగులు చేశారు. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో వైభవ్ అరోరా 2, వరుణ్ చక్రవర్తి 1, ఆండ్రీ రస్సెల్ 1 వికెట్ తీశారు.
Punjab Kings
Kolkata Knight Riders
IPL 2024
Priyansh Arya
Prabhsimran Singh
Eden Gardens
Cricket Match
T20 Cricket
Opening Partnership
Massive Score

More Telugu News