Rajasekhar: విజయనగరం జిల్లాలో ఘోరం... తల్లిదండ్రులను ట్రాక్టర్ తో ఢీకొట్టి చంపిన కుమారుడు

Son Kills Parents with Tractor in Vijaynagaram
  • పూసపాటిరేగ మండలం నడిపూరికల్లాలు గ్రామంలో ఘటన
  • ఆస్తిలో కుమార్తెకు కూడా వాటా రాసిన తల్లిదండ్రులు
  • తల్లిదండ్రులపై కక్ష పెంచుకున్న కుమారుడు
విజయనగరం జిల్లాలో ఘోరం జరిగింది. పూసపాటిరేగ మండలం నడిపూరికల్లాలు గ్రామంలో తల్లిదండ్రులను కుమారుడు ట్రాక్టర్ తో ఢీకొట్టి చంపాడు. అప్పలనాయుడు (55), జయ (45)లను కుమారుడు రాజశేఖర్ హత్య చేశాడు. ఆస్తిలో చెల్లెలకి కూడా వాటా ఇచ్చారన్న కక్షతో రాజశేఖర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 

ఆస్తిలో వాటా విషయమై కొంతకాలంగా తల్లిదండ్రులు, కుమారుడి మధ్య వివాదం నడుస్తోంది. కుమార్తెకు ఇచ్చిన భూమిని కుమారుడు చదును చేసే ప్రయత్నం చేస్తుండగా తల్లిదండ్రులు అడ్డుకున్నారు. అడ్డొచ్చిన తల్లిదండ్రులపైకి రాజశేఖర్ ట్రాక్టర్ పోనిచ్చాడు. దాంతో అప్పలనాయుడు, జయ ప్రాణాలు విడిచారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Rajasekhar
Parricide
Vijaynagaram District
Andhra Pradesh
Property Dispute
Tractor Accident
Murder
Appalanaydu
Jaya
Nadapurikallalu

More Telugu News