హైద‌రాబాద్‌లో అత్యంత ఎత్తైన భ‌వంతి.. ఏకంగా 57 అంత‌స్తులు

  • సాస్ క్రౌన్ పేరిట కోకాపేట్‌లో ఆకాశ‌హ‌ర్మ్యం 
  • 4.5 ఎక‌రాల విస్తీర్ణంలో నిర్మాణం
  • ఒక అంత‌స్తుకు ఒక ఫ్లాట్‌, స్కై విల్లాస్ వంటి ప్ర‌త్యేక‌త‌లు
హైద‌రాబాద్‌లో ఏకంగా 57 అంత‌స్తులతో అత్యంత ఎత్తైన భ‌వంతి నిర్మాణం జ‌రుపుకుంటోంది. సాస్ క్రౌన్ పేరిట కోకాపేట్‌లో ఈ ఆకాశ‌హ‌ర్మ్యం నిర్మిత‌మ‌వుతోంది. 4.5 ఎక‌రాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భ‌వ‌నానికి ప్ర‌స్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు. 

ఇందులో ఒక అంత‌స్తుకు ఒక ఫ్లాట్‌, స్కై విల్లాస్ వంటి ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. భాగ్య‌న‌గ‌రంలో ఇప్ప‌టివ‌ర‌కు నిర్మించిన అత్యంత ఎత్తైన భ‌వ‌నం కూడా ఇదే.  

ఇదే మాదిరి మ‌రిన్ని ఆకాశ‌హ‌ర్మ్యాలు న‌గ‌రంలో  వేర్వేరు ప్రాంతాల‌లో నిర్మాణ ద‌శ‌లో ఉన్నాయి. 62 అంత‌స్తుల వ‌ర‌కు మ‌రో భ‌వ‌నం అనుమ‌తుల ద‌శ‌లో ఉంది. వీటన్నింటితో ఆకాశ హ‌ర్మ్యాల్లో దేశ ఆర్థిక రాజ‌ధాని త‌ర్వాత హైద‌రాబాద్ రెండో స్థానంలో నిలిచింది. 



More Telugu News