Kolleru Lake: కొల్లేరు దుస్థితి.. నీళ్లులేక పగుళ్లిచ్చిన సరస్సు

Kolleru Lake Drying Up A Crisis in Andhra Pradesh
--
కొల్లేరు సరస్సు ఎండిపోతోంది. ఏలూరు గ్రామీణ మండలం ప్రత్తికోళ్లలంకలో బీటలు వారింది. చుక్క నీరు లేక నేల పగుళ్లిచ్చింది. ఒకప్పుడు నీటితో కళకళలాడిన కొల్లేరులో ప్రస్తుతం నీళ్లు లేక మత్స్యకారులు జీవనోపాధిని కోల్పోయి నిరాశ్రయులవుతున్నారు. కొల్లేటి తీరంలో జీవనం సాగించలేక చాలామంది వలస బాట పడుతున్నారు. 

సరస్సులో ఆహారం లభించక పోవడంతో పక్షులు కూడా కనిపించడం లేదు. బీటలు వారిన నేలలో అక్కడక్కడా వదిలేసిన తాటిదోనెలు దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు ఎటు చూసినా నీటితో నిండి ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు నీటి చుక్క కరువై కళావిహీనంగా మారింది.
Kolleru Lake
Andhra Pradesh
Water Scarcity
Drying Lake
Fishermen
Environmental Crisis
Ecological Damage
Wildlife Impact
Pattikollalanka

More Telugu News