Pandya Brothers: హార్దిక్ పాండ్యా తల్లి గొప్ప మనసు.. ఇదిగో వీడియో!

టీమిండియా క్రికెటర్లు హార్దిక్, కృనాల్ పాండ్యాల తల్లి నళినీబెన్ పాండ్యా గొప్ప మనసు చాటుకున్నారు. శ్రవణ్ సేవా ఫౌండేషన్ ద్వారా బరోడాలోని పంజ్రపోల్‌లో మూగ జీవాలకు ఆహారం అందించారు. 700 ఆవులకు 2,100 కిలోల మామిడి పళ్ల రసం, 5,000 రోటీలను అందజేశారు.
స్వయంగా ఆమె ఈ సేవలో పాల్గొనడం విశేషం. వారి కుటుంబ సంప్రదాయంలో భాగంగా ఈ పని చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆవుల ఆకలి తీర్చిన పాండ్యా తల్లి నళినీ గొప్ప మనసును నెటిజన్లు కొనియాడుతున్నారు.
ఇక, ప్రస్తుతం పాండ్యా బ్రదర్స్ ఐపీఎల్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ముంబయి ఇండియన్స్ (ఎంఐ)కు హార్దిక్ కెప్టెన్‌గా ఉంటే... కృనాల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.