Naga Chaitanya: మా రెస్టారెంట్ సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది: నాగచైతన్య

- ఫుడ్ బిజినెస్‌లోనూ రాణిస్తున్న నటుడు నాగచైతన్య
- దేవర మూవీ ప్రమోషన్స్‌లో జపాన్‌లో చైతన్య షోయు రెస్టారెంట్‌పై మాట్లాడిన ఎన్టీఆర్
- ఎన్టీఆర్ తన షోయు రెస్టారెంట్‌పై కితాబు ఇస్తూ మాట్లాడటం ఆనందం కల్గించిందన్న నాగచైతన్య
ప్రముఖ నటుడు అక్కినేని నాగచైతన్య ఫుడ్ బిజినెస్‌లోనూ రాణిస్తున్న విషయం విదితమే. ఆయన కొన్నేళ్ల క్రితం నగరంలో ‘షోయు’ పేరుతో ఒక రెస్టారెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ రుచికరమైన వంటకాలను అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
అనంతరం నాగచైతన్య ‘షోయు’ గురించి ఇటీవల హీరో ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.
‘దేవర’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల జపాన్‌కు వెళ్లిన ఎన్టీఆర్ తన రెస్టారెంట్ గురించి గొప్పగా చెప్పారని, ఆ వీడియో చూసి ఎంతో ఆనందం కలిగిందని నాగచైతన్య అన్నారు.
గతంలో చైతన్య ‘షోయు’ గురించి మాట్లాడుతూ ప్రీమియం క్లౌడ్ కిచెన్ పెట్టాలనే ఆలోచన లాక్‌డౌన్‌లో వచ్చిందని, అలా తమ రెస్టారెంట్ ప్రారంభమైందని తెలిపారు. ప్రస్తుతం తమ రెస్టారెంట్ విజయవంతంగా నడుస్తోందని చైతన్య పేర్కొన్నారు.