OTT releases: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్ లు వచ్చాయో... ఓ లుక్కేయండి!

New Telugu Movies  Series on OTT this Friday

  • ఓటీటీలో ఈ వారం 25కు పైగా కొత్త చిత్రాల వెల్లువ
  • వివిధ అంతర్జాతీయ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్
  • ఈ వేసవిలో అసలు సిసలు వినోదం!

వారాంతం వచ్చేసింది. ఈ వేసవిలో ఇంట్లోనే కూర్చుని వినోదాన్ని ఆస్వాదించే సినీ ప్రియుల కోసం ఓటీటీ వేదికల్లో ఈ శుక్రవారం కొత్త కంటెంట్ వచ్చేసింది. థియేటర్లలో కొన్ని కొత్త చిత్రాలు విడుదలైనప్పటికీ, డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ వారం నయా కంటెంట్ వెల్లువెత్తింది. తాజాగా, దాదాపు 25కు పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వివిధ ఓటీటీ యాప్‌లలో అందుబాటులోకి వచ్చాయి. తెలుగు స్ట్రెయిట్ చిత్రాలతో పాటు, డబ్బింగ్ సినిమాలు, ఇతర భాషా చిత్రాలు, అంతర్జాతీయ సిరీస్‌లు ఈ జాబితాలో ఉన్నాయి.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, సన్ నెక్స్ట్, ఆహా, ఆపిల్ ప్లస్ టీవీ వంటివి తమ కంటెంట్ లైబ్రరీని విస్తరించుకున్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని విడుదలైన 'మ్యాడ్ స్క్వేర్' (నెట్‌ఫ్లిక్స్), 'మజాకా' (అమెజాన్ ప్రైమ్), 'గార్డియన్' (ఆహా) వంటి చిత్రాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అలాగే, తెలుగులోకి అనువాదమైన 'జ్యూయెల్ థీప్' (నెట్‌ఫ్లిక్స్), 'వీరధీరశూర' (అమెజాన్ ప్రైమ్), 'ఎల్ 2 ఎంపురాన్' (హాట్‌స్టార్), 'సూపర్ బాయ్స్ మాలెగావ్' (అమెజాన్ ప్రైమ్) వంటివి కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి.

వివిధ ఓటీటీ వేదికల్లో విడుదలైన చిత్రాలు/సిరీస్‌ల పూర్తి వివరాలు


అమెజాన్ ప్రైమ్ వీడియో
* మజాకా (తెలుగు మూవీ)
* వీరధీరశూర (తెలుగు చిత్రం - ఇప్పటికే స్ట్రీమింగ్‌లో ఉంది)
* కల్లు కాంపౌండ్ (తెలుగు మూవీ)
* సూపర్ బాయ్స్ మాలెగావ్ (తెలుగు డబ్బింగ్ మూవీ)
* ఫ్లో (ఇంగ్లీష్ సినిమా)
* ఇరవనిల్ ఆటమ్ పర్ (తమిళ మూవీ)
* ల్యాండ్ లైన్ (ఇంగ్లీష్ సినిమా)
* వివాహ ఆహ్వానం (మలయాళ చిత్రం)
* నోవకైన్ (ఇంగ్లీష్ మూవీ)
* సమర (మలయాళ సినిమా)
* తకవి (తమిళ సినిమా)

నెట్‌ఫ్లిక్స్
* మ్యాడ్ స్క్వేర్ (తెలుగు సినిమా)
* జ్యూయెల్ థీప్ (తెలుగు డబ్బింగ్ సినిమా)
* హవోక్ (ఇంగ్లీష్ మూవీ)
* ఈజ్ లవ్ సస్టెయనబుల్ (జపనీస్ సిరీస్)
* ద రెలుక్టెంట్ పీచర్ (జపనీస్ సిరీస్)
* వీక్ హీరో క్లాస్ 2 (కొరియన్ సిరీస్)

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
* ఎల్ 2 ఎంపురాన్ (తెలుగు డబ్బింగ్ మూవీ - ఇప్పటికే స్ట్రీమింగ్‌లో ఉంది)
* ఫ్రాన్సిస్ ద పీపుల్స్ పోప్ (ఇంగ్లీష్ మూవీ)
* కజిలియోనైరీ (ఇంగ్లీష్ సినిమా)
* వాండర్ పంప్ విల్లా సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)

ఆహా
* గార్డియన్ (తెలుగు సినిమా - ఇప్పటికే స్ట్రీమింగ్‌లో ఉంది)

జీ5
* అయ‍్యన మానే (కన్నడ సిరీస్)
* ఎస్ఎఫ్ 8 (కొరియన్ సిరీస్)

సన్ నెక్స్ట్
* నిరమ్ మరుమ్ ఉళగిల్ (తమిళ సినిమా)
* లాఫింగ్ బుద్ధా (కన్నడ మూవీ)

ఆపిల్ ప్లస్ టీవీ
* వోండ్లా సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)


OTT releases
Telugu movies
Amazon Prime Video
Netflix
Disney+ Hotstar
Aha Video
Zee5
Sun NXT
Apple TV+
New releases
Weekend binge
Streaming
Mad Square
Majaka
Guardian
Telugu web series
International series
Dubbed movies
  • Loading...

More Telugu News