Chandrababu Naidu: కాసేపట్లో ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ

CM Chandrababu Naidu to Meet PM Modi Shortly
  • సాయంత్రం 4.30 గంటలకు మోదీతో చంద్రబాబు భేటీ
  • భార్య భువనేశ్వరితో కలిసి తొలిసారి మోదీని కలవనున్న బాబు
  • అమరావతి పునఃనిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించనున్న చంద్రబాబు
భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో భేటీ కాబోతున్నారు. సాయంత్రం 4.30 గంటలకు వీరి భేటీ జరగబోతోంది. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃనిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఈ సందర్భంగా ప్రధానిని ముఖ్యమంత్రి ఆహ్వానించనున్నారు. మే 2వ తేదీని మోదీ అమరావతిలో పర్యటించనున్నారు. 

అమరావతితో పాటు పోలవరం ప్రాజెక్టు, ఇతర ముఖ్య అంశాలపై మోదీతో చంద్రబాబు చర్చించనున్నారు. మరోవైపు, ఈ సమావేశానికి ఒక ప్రాధాన్యత ఉంది. తన భార్య భువనేశ్వరితో కలిసి చంద్రబాబు తొలిసారి ప్రధానితో భేటీ అవబోతున్నారు. రాజధానికి సంబంధించి అత్యంత ముఖ్య కార్యక్రమం కావడంతో సతీసమేతంగా ప్రధానిని కలిసి అమరావతికి ఆహ్వానించనున్నారు.

ప్రధాని అమరావతి పర్యటనపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఏపీ మంత్రి నారాయణ నిన్న ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. అమరావతిలో మోదీ పర్యటన గంటన్నరసేపు ఉంటుందని తెలుస్తోంది.
Chandrababu Naidu
Narendra Modi
Amaravati
Andhra Pradesh
Modi Amaravati Visit
Chandrababu Modi Meeting
Polavaram Project
AP Government
Amaravati Development

More Telugu News