PSR Anjaneyulu: సీఐడీ కస్టడీకి మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు

PSR Anjaneyulu in CID Custody

--


బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీని వేధింపులకు గురిచేసిన కేసులో మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న పీఎస్ఆర్ ను తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ అధికారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సీఐడీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు సానుకూలంగా స్పందించింది. పీఎస్ఆర్ ను మూడు రోజుల కస్టడీకి అప్పగిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు కస్టడీకి అనుమతించింది.

పీఎస్ఆర్ ను సీఐడీ అధికారులు మంగళవారం అరెస్ట్ చేసి బుధవారం ఉదయం విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. నటి వేధింపుల కేసులో పీఎస్ఆర్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పీఎస్ఆర్ ఆంజనేయులును రిమాండ్‌కు ఇవ్వాలని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ముంబై నటి వేధింపుల కేసులో సాక్ష్యాలు తారుమారు చేసేందుకు పీఎస్ఆర్ ప్రయత్నించారని కోర్టుకు తెలిపారు. నటి వేధింపుల వెనుక ప్రణాళిక అంతా పీఆర్ఎస్ దే అని విశాల్ గున్నీ వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. విశాల్ గున్నీతోపాటు నాటి విజయవాడ సీపీ కాంతిరాణాను సీఎంఓకు పీఎస్ఆర్ పిలిపించారని ముంబై నటిపై తప్పుడు కేసు పెట్టి 42 రోజులు జైలులో ఉంచారని చెప్పారు. దీనిపై గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైందని కోర్టుకు వివరణ ఇచ్చారు.

PSR Anjaneyulu
CID Custody
Bollywood Actress Harassment
Kadambari Jawant
Visakhapatnam Police
Andhra Pradesh Crime
Remand Prisoner
Vijayawada Court
Vishal Gunni
Kanti Rana
  • Loading...

More Telugu News