Jaggaiahpet car accident: జగ్గయ్యపేటలో కూలీలపైకి దూసుకెళ్లిన కారు.. వీడియో ఇదిగో!

Andhra Pradesh Road Accident Car Hits Coolies in Jaggaiahpet
--
ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో శుక్రవారం ఉదయం ఒక కారు ప్రమాదం సంభవించింది. స్థానిక చెరువు బజార్ లో రోడ్డు పక్కన నిలబడిన కూలీలపైకి ఓ కారు దూసుకువెళ్లింది. దీంతో ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని ఓ సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. కొంతమంది వ్యక్తులు రోడ్డు పక్కనే ఉన్న గోడ వద్ద నిలబడి మాట్లాడుకోవడం కనిపిస్తోంది. కొందరు ద్విచక్ర వాహనంపై కూర్చుని ఉండగా మరికొందరు వారి పక్కనే నిలబడి ఉన్నారు. ఇంతలో ఒక కారు వేగంగా దూసుకురావడం గమనించి వారు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కారు వారిని ఢీ కొని రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. దీంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని క్షతగాత్రులకు సాయం చేశారు. కొంతమంది ఆగ్రహంతో కారు డ్రైవర్ ను చితకబాదారు.
Jaggaiahpet car accident
Andhra Pradesh accident
NTR district accident
Coolies injured
CCTV footage viral
Road accident
Jaggaiahpet
Andhra Pradesh
NTR district
reckless driving

More Telugu News