Mercedes Maybach Taxi: మెర్సిడెస్ కారు కొని టాక్సీగా తిప్పుతున్న చైనా యువకుడు.. బీజింగ్‌లో ఒక్క ట్రిప్పుకే రూ.46 వేలు!

Chinese Man Drives Luxury Mercedes Maybach as Taxi
  • 1.8 కోట్లతో మేబాక్ కారు కొనుగోలు చేసినట్లు వెల్లడి
  • ఖర్చులు పోనూ నెలకు రూ.1.1 లక్షల వరకు పొదుపు
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోస్టు
విలాసవంతమైన కార్లలో ప్రయాణించాలని చాలా మందికి ఉంటుంది కానీ కోట్లు ఖర్చు పెట్టి వాటిని కొనే స్థోమత లేక చాలామంది నిరాశపడుతుంటారు. చైనాకు చెందిన ఓ యువకుడు ఇలాంటి వారికి సేవలందించడమే తన వ్యాపారంగా మార్చుకున్నాడు. రూ.1.8 కోట్లు ఖర్చు చేసి విలాసవంతమైన మెర్సిడెస్ మేబాక్ కారును కొనుగోలు చేశాడు. ఈ కారుతో బీజింగ్ లో టాక్సీ సేవలందిస్తున్నాడు. ఈ సేవలు కాస్త ఖరీదైనవే అయినప్పటికీ లగ్జరీ కారులో ప్రయాణించాలనే కోరిక తీర్చుకునే అవకాశం తన కస్టమర్లకు కలుగుతుందని చెబుతున్నాడు.

చైనాకు చెందిన ఓ 30 ఏళ్ల యువకుడు యువాన్ సుమారు రూ. 1.8 కోట్లు (210,000 డాలర్లు) వెచ్చించి మెర్సిడెస్ మేబాక్ కారుతో క్యాబ్ సర్వీస్ నడుపుతూ ఒక్కో ట్రిప్పు ద్వారా దాదాపు రూ. 46,000 (550 డాలర్ల) వరకు సంపాదిస్తున్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది.

ఉత్తర చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన యువాన్ 2019 నుంచి బీజింగ్‌లో లగ్జరీ కార్లతో రైడ్ హెయిలింగ్ సేవలు అందిస్తున్నాడు. గత ఏడాది నవంబర్‌లో మేబాక్ కారు కొనుగోలు చేసినప్పటి నుంచి తన రోజువారీ అనుభవాలను "ఓల్డ్ యువాన్ డ్రైవ్స్ ఎ మేబాక్ ఫర్ రైడ్-హెయిలింగ్" అనే సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటున్నాడు. దీంతో అతనికి ఆన్‌లైన్‌లో దాదాపు 1.2 లక్షల మంది ఫాలోవర్లు ఏర్పడ్డారు.

తాను నాణ్యతకే ప్రాధాన్యత ఇస్తానని, ఎక్కువగా ముందుగా బుక్ చేసుకునే హై ఎండ్ క్లయింట్లకే సేవలు అందిస్తానని యువాన్ తెలిపాడు. ఏప్రిల్‌లో షేర్ చేసిన ఓ వీడియోలో, ఒక రోజు ఫుల్-డే బుకింగ్‌తో దాదాపు రూ. 46,000 (550 డాలర్లు) సంపాదించినట్లు వెల్లడించాడు. నెలకు సగటున 40 ఆర్డర్లు పూర్తి చేస్తూ, ఇంధనం, ఆహారం, ఇంటి అద్దె వంటి నెలవారీ ఖర్చులు పోగా, నెలకు దాదాపు 10,000 యువాన్లు (సుమారు రూ. 1.1 లక్షలు) ఆదా చేస్తున్నట్లు యువాన్ పేర్కొన్నాడు. "ఇదే  నా జీవనాధారం. ప్రస్తుతం బీజింగ్, షాంఘైలలో మాత్రమే ఈ మేబాక్ మోడల్‌తో రైడ్-హెయిలింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి" అని యువాన్ చెప్పాడు.
Mercedes Maybach Taxi
Luxury Taxi Service
Beijing China
YUAN
Ride-hailing
High-end Clients
Expensive Taxi Trip
China Luxury Cab
Social Media Influencer

More Telugu News