రోబో కుక్కతో కలిసి గంతులేసిన గవాస్కర్... ఫన్నీ వీడియో ఇదిగో!

 
భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చాన్నాళ్లుగా క్రికెట్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఎంతో సరాదాగా ఉంటారు. తాజాగా, ఐపీఎల్ లో రోబో కుక్కతో ఆయన గంతులేసిన వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఐపీఎల్ 18వ సీజన్ లో రోబో కుక్కలను ప్రవేశపెట్టారు. ఈ మెషీన్ డాగ్స్ టాస్ సమయంలో బంతిని మోసుకొస్తూ సందడి చేస్తున్నాయి.

ఇవాళ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ప్రారంభానికి ముందు రోబో డాగ్ తో కలిసి గవాస్కర్ మైదానంలో ఫన్ క్రియేట్ చేశారు. కుక్కతో పాటు ఉత్సాహంగా గెంతారు. అదేం చేస్తే తాను కూడా అదే చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఐపీఎల్ నిర్వాహకులు షేర్ చేశారు.


More Telugu News

Sunil Gavaskar IPL Robot Dog Funny Video Cricket RCB Rajasthan Royals Chinnaswamy Stadium IPL 2023 Viral Video