పహల్గాం దాడి ఎఫెక్ట్.. హైదరాబాద్, ముంబై నగరాల్లో హైఅలర్ట్

  • కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసు శాఖ
  • హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత
  • ముంబై, మహారాష్ట్ర తీర ప్రాంతంలోను భద్రత పెంపు
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో హైదరాబాద్‌తో సహా తెలంగాణ రాష్ట్రంలో హైఅలర్ట్ విధించారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల మేరకు రాష్ట్ర పోలీసు శాఖ అప్రమత్తమైంది.

ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

మహారాష్ట్రలోనూ...

మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంతో పాటు దాని తీర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేసినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ దాడి అనంతరం మహారాష్ట్ర హోంశాఖ అప్రమత్తమైంది. సముద్ర మార్గంలో నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలని ముంబై పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ముంబై తీర ప్రాంతంలో భద్రతను పెంచారు.


More Telugu News