ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయానికి వచ్చిన ఎస్ఎస్ రాజమౌళి

  • అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ కోసం వచ్చిన రాజమౌళి
  • ధృవీకరించిన హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేష్
  • కార్యాలయంలో సంతకం చేసి, ఫోటో దిగిన రాజమౌళి
  • అనంతరం లైసెన్స్ అందజేసిన అధికారులు
ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని (ఆర్టీవో) సందర్శించారు. ఆయన తన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ను పునరుద్ధరించుకునేందుకు (రెన్యూవల్) వచ్చినట్లు హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (జేటీసీ) రమేష్ అధికారికంగా తెలిపారు.

లైసెన్స్ రెన్యూవల్ ప్రక్రియలో భాగంగా రాజమౌళి స్వయంగా ఆర్టీవో కార్యాలయానికి విచ్చేశారు. అక్కడ అవసరమైన దరఖాస్తు ఫారమ్‌పై సంతకం చేయడంతో పాటు, డిజిటల్ ఫోటో కూడా దిగారు. అధికార నిబంధనల ప్రకారం ఆయనకు పునరుద్ధరించిన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ను అందజేశారు.

దర్శకధీరుడు రాజమౌళి తన అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ రెన్యూవల్ కోసమే ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయానికి వచ్చారని జేటీసీ రమేష్ స్పష్టం చేశారు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న తదుపరి భారీ చిత్రానికి సంబంధించి విదేశాల్లో చిత్రీకరణ జరపాల్సి ఉందని, అందుకోసమే ఈ అంతర్జాతీయ లైసెన్స్ అవసరం పడిందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన లైసెన్స్ రెన్యూవల్ చేయించుకున్నట్లు సమాచారం.


More Telugu News