PSR Anjaneyulu: పీఎస్ఆర్ ఆంజనేయులు కోరికను తిరస్కరించిన జైలు అధికారులు

Former AP IB Chief PSR Anjaneyulu Denied Religious Rituals in Jail
  • నటి జత్వానీ కేసులో విజయవాడ జిల్లా జైలుకు పీఎస్ఆర్ ఆంజనేయులు
  • సంధ్యావందనం చేసుకోవడానికి పూజా సామగ్రిని అనుమతించాలన్న పీఎస్ఆర్
  • జైలు నిబంధనల ప్రకారం అనుమతి నిరాకరించిన అధికారులు
ముంబై నటి జత్వానీ వేధింపుల ఆరోపణల కేసులో అరెస్టయిన మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులును విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. అక్కడ ఆయనకు అధికారులు ఖైదీ నెంబర్ 7814 కేటాయించారు.

జైలుకు వెళ్లిన అనంతరం ఆంజనేయులు తాను రోజూ సంధ్యావందనం చేసుకుంటానని, అందుకు అవసరమైన పూజా సామగ్రిని అనుమతించాలని జైలు అధికారులను కోరారు. అయితే, జైలు నిబంధనల ప్రకారం అధికారులు అనుమతి నిరాకరించారు. ఈ విషయాన్ని నిన్న జైలును సందర్శించిన జైళ్ల శాఖ డీఐజీ దృష్టికి స్థానిక అధికారులు తీసుకెళ్లారు.

తాను ఈ అభ్యర్థనను ఉన్నతాధికారులకు నివేదిస్తానని, వారి నిర్ణయం తర్వాత తెలియజేస్తానని డీఐజీ చెప్పినట్లు సమాచారం. దీంతో సంధ్యావందనం చేసుకునేందుకు ఆంజనేయులుకు అనుమతి లభిస్తుందా? లేదా? అనే దానిపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 
PSR Anjaneyulu
Vijayawada Jail
Mumbai Actress Jathwani
Intelligence Bureau Chief
Arrest
Prison Regulations
Religious Practices in Jail
Santhya Vandana
DIG Prisons
Jail Rules

More Telugu News