Danish Kaneria: ఉగ్రదాడి వేళ.. సొంత దేశంపై పాక్ మాజీ క్రికెటర్ ఆగ్రహం.. సిగ్గు పడాలంటూ ధ్వజం!

పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్థాన్ పాత్రపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిశ్ కనేరియా ప్రశ్నించారు. ఉగ్రదాడిలో నిజంగా పాకిస్థాన్ పాత్ర లేకపోయి ఉంటే ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఇంకా ఎందుకు ఖండించలేదని కనేరియా నిలదీశారు. బలగాలెందుకు హై అలర్ట్‌లోకి వెళ్లాయంటూ ప్రశ్నించారు. ఈ మేరకు డానిశ్ కనేరియా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పోస్టు పెట్టారు.
"పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాకిస్థాన్ పాత్ర నిజంగా లేకపోతే, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఇంకా ఎందుకు ఖండించలేదు? మీ దళాలు అకస్మాత్తుగా ఎందుకు అప్రమత్తమయ్యాయి? ఎందుకంటే లోతుగా మీకు నిజం తెలుసు. మీరు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, వారిని పెంచి పోషిస్తున్నారు. సిగ్గు పడాలి" అని కనేరియా ధ్వజమెత్తారు.