Pakistan: పహల్గామ్ దాడి తర్వాత పాక్ లో టెన్షన్.. సరిహద్దులకు యుద్ధ విమానాలు..!
--
పహల్గామ్ సమీపంలోని బైసరన్ వ్యాలీ వద్ద మంగళవారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడి తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వం అప్రమత్తమైందని, భారత సరిహద్దుల వద్దకు యుద్ధ విమానాలను పంపిస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన ఆధారాలుగా నెటిజన్లు ‘ఫ్లైట్ రాడార్’ డాటాకు సంబంధించిన క్లిప్పింగ్ లను పోస్టు చేస్తున్నారు.
ఫ్లైట్ రాడార్ డాటాలో పాకిస్థాన్ వాయుసేన విమానాలు కరాచీలోని దక్షిణ ఎయిర్ కమాండ్ నుంచి లాహోర్, రావల్పిండి సమీపంలోని ఉత్తర వైమానిక స్థావరాలకు చేరుకుంటున్నట్లు కనిపిస్తోంది. రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం పాకిస్థాన్ ముఖ్యమైన ఆపరేషనల్ బేస్‌లలో ఒకటి.. ఈ నేపథ్యంలోనే బేస్ భద్రతా ఏర్పాట్లను పాక్ పటిష్ఠం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, సరిహద్దులకు యుద్ధ విమానాల తరలింపు వార్తలపై అటు పాకిస్థాన్ కానీ, ఇటు భారత అధికారులు కానీ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.