మరణానంతరం పోప్‌ ఫ్రాన్సిస్‌ తొలి ఫొటో విడుద‌ల

  • సోమవారం ఉదయం కన్నుమూసిన పోప్ ఫ్రాన్సిస్
  • మరణానంతరం పోప్‌ తొలి ఫొటోను విడుద‌ల చేసిన‌ వాటికన్‌ అధికారులు
  • ఫొటోలో ఓపెన్‌ శవపేటికలో పోప్‌ ఫ్రాన్సిస్‌ను ప‌డుకోబెట్టిన దృశ్యం
ప్రపంచ క్యాథలిక్ క్రైస్తవుల మత గురువు, పోప్ ఫ్రాన్సిస్ (88) సోమవారం ఉదయం కన్నుమూసిన విష‌యం తెలిసిందే. అయితే, మరణానంతరం పోప్‌ ఫ్రాన్సిస్‌ తొలి ఫొటోను వాటికన్‌ అధికారులు తాజాగా విడుద‌ల‌ చేశారు. ఓపెన్‌ శవపేటికలో పోప్‌ ఫ్రాన్సిస్‌ను ప‌డుకోబెట్టిన దృశ్యం ఆ ఫొటోలో మ‌నం చూడొచ్చు. 

మరోవైపు పోప్‌ అంత్యక్రియలకు వాటికన్‌ అధికారులు సన్నాహకాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. శుక్రవారం, ఆదివారం మధ్య అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు వారు తెలిపారు. ఈ నేప‌థ్యంలోనే నేడు రోమ్‌లో కార్డిన‌ల్స్ భేటీ జరగనుంది. రోమ్‌లో అందుబాటులో ఉన్న కార్డినల్స్‌ మొత్తాన్ని ఇప్పటికే ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఇందులో పోప్‌ ఫ్రాన్సిస్‌ భౌతిక కాయానికి సెయింట్‌ పీటర్స్‌ బసిలికాకు ఎప్పుడు తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచాలనే విషయాన్ని నిర్ణయిస్తార‌ని తెలుస్తోంది.

ఇక‌, పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియ‌ల్లో పాల్గొంటాన‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్ర‌టించారు. రోమ్‌లో జ‌రిగే అంత్యక్రియ‌ల‌కు త‌న అర్ధాంగి మెలానియా ట్రంప్‌తో క‌లిసి వెళ్లనున్నట్లు ఆయ‌న‌ తెలిపారు. త‌న సొంత సామాజిక మాధ్య‌మం ట్రూత్ సోష‌ల్ ద్వారా అధ్య‌క్షుడు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. 


More Telugu News