సెంచరీ చేజార్చుకున్న గిల్... గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు
- ఐపీఎల్ లో నేడు గుజరాత్ టైటాన్స్ × కోల్ కతా నైట్ రైడర్స్
- కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్
- సొంతగడ్డపై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్
కెప్టెన్ శుభ్ మన్ గిల్ అద్బుతంగా ఆడి 55 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులతో 90 పరుగులు చేశాడు. 10 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ తన ఫామ్ ను కంటిన్యూ చేస్తూ మరో అర్ధసెంచరీ నమోదు చేశాడు. సుదర్శన్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 52 పరుగులు చేసి ఆండ్రీ రసెల్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.
వన్ డౌన్ లో వచ్చిన జోస్ బట్లర్ తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు. బట్లర్ 23 బంతుల్లో 8 ఫోర్లతో అజేయంగా 41 పరుగులు చేశాడు. రాహుల్ తెవాటియా (0) డకౌట్ అయ్యాడు. కోల్ కతా బౌలర్లలో వైభవ్ అరోరా 1, హర్షిత్ రాణా 1, ఆండ్రీ రసెల్ 1 వికెట్ తీశారు.