టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్ తో పోరు... టాస్ గెలిచిన కేకేఆర్

  • పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న గుజరాత్ టైటాన్స్
  • నేడు ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్ 
ఐపీఎల్ 18వ సీజన్ లో ఇవాళ గుజరాత్ టైటాన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ ఢీకొంటున్నాయి. కోల్ కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. కోల్ కతా జట్టులో రహ్మనుల్లా గుర్బాజ్, మొయిన్ అలీకి చోటు కల్పించారు. మరోవైపు, గుజరాత్ టైటాన్స్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. 

టోర్నీలో ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్ 7 మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కోల్ కతా నైట్ రైడర్స్ 7 మ్యాచ్ ల్లో 3 విజయాలతో ఏడో స్థానంలో ఉంది.


More Telugu News