చ‌రిత్ర సృష్టించిన జాన్ సీనా

  • అత్య‌ధిక సార్లు వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌షిప్ టైటిళ్లు గెలిచిన ప్రొఫెష‌న‌ల్ రెజ్ల‌ర్‌గా చ‌రిత్ర 
  • ఇప్ప‌టివ‌ర‌కూ 17 వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌షిప్ టైటిల్స్ నెగ్గిన‌ జాన్ సీనా
  • అంత‌కుముందు ఈ ఘ‌న‌త రిక్ ఫ్లైర్ పేరిట  
డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ స్టార్ జాన్ సీనా అత్య‌ధిక సార్లు వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌షిప్ టైటిళ్లు గెలిచిన ప్రొఫెష‌న‌ల్ రెజ్ల‌ర్‌గా చ‌రిత్ర సృష్టించారు. ఇప్ప‌టివ‌ర‌కూ అత‌డు 17 వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌షిప్ టైటిల్స్ నెగ్గాడు. అంత‌కుముందు ఈ ఘ‌న‌త రిక్ ఫ్లైర్ పేరిట ఉండేది.

తాజాగా జ‌రిగిన రెసిల్‌మేనియా 41 ఈవెంట్‌లో జాన్ సీనా... కొడీ రోడ్స్‌ను ఓడించి 17వ సారి వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌షిప్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. దీంతో ఫ్లైర్ రికార్డు బ్రేక్ అయింది. కాగా, డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈకి ఇటీవ‌ల రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన జాన్ సీనాకు రెసిల్‌మేనియాలో ఇదే చివ‌రి ఈవెంట్. 


More Telugu News