ప్రకాశం జిల్లాలో క్రికెట్ ఆడుతున్న యువకులపై పిడుగుపాటు

  
ఏపీలోని ప్ర‌కాశం జిల్లా బేస్తవారిపేట మండ‌లం పెద్ద ఓబినేనిప‌ల్లెలో నిన్న విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. కొంత‌మంది యువ‌కులు క్రికెట్ ఆడుతున్న స‌మ‌యంలో పిడుగుప‌డింది. దీంతో స‌న్నీ (17), ఆకాశ్ (18) అనే ఇద్ద‌రు యువ‌కులు మృత్యువాత ప‌డ్డారు. మ‌రో యువ‌కుడికి తీవ్ర గాయాల‌య్యాయి. గాయ‌ప‌డిన వ్య‌క్తిని చికిత్స కోసం స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌తో ఓబినేనిప‌ల్లెలో విషాదం అల‌ముకుంది. మృతుల కుటుంబీకులు క‌న్నీరుమున్నీరుగా విలపించారు. 


More Telugu News