Chandrababu Naidu: ఈ వీడియో చూస్తే కొండనైనా ఢీకొట్టే కాన్ఫిడెన్స్ వస్తుంది: ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్

Chandrababu Naidus 75th Birthday Minister Shares Inspirational Video
  • నేడు చంద్రబాబు 75వ పుట్టినరోజు
  • విషెస్ తెలియజేసిన ఏపీ కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్
  • ఆసక్తికర వీడియో షేర్ చేసిన వైనం
ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఓ ఆసక్తికర వీడియో పంచుకున్నారు. ఇందులో చంద్రబాబు జీవిత ప్రస్థానం యావత్తు చూపించారు. ఓ వ్యక్తి వ్యాఖ్యానంలో చంద్రబాబు జీవితంలోని ముఖ్య ఘట్టాలను వివరిస్తూ ఈ వీడియో సాగుతుంది. 

దీనిపై మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందిస్తూ... 75 ఏళ్ల చంద్రబాబు గారి జీవితం రెండు నిమిషాల్లో చూపించిన అద్భుత వీడియో అని అభివర్ణించారు. జీవితంలో ఇన్ స్పిరేషన్ కావాలి అనుకునే ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తే చాలు... కొండనైనా ఢీకొట్టే కాన్ఫిడెన్స్ వస్తుంది అని పేర్కొన్నారు.
Chandrababu Naidu
Vasamsetti Subhash
Andhra Pradesh Minister
75th Birthday
Inspirational Video
AP Politics
Telugu Politics
Indian Politics
Chandrababu Naidu Biography
Leadership

More Telugu News