బాపట్లలో హోటళ్లు, లాడ్జిలలో పోలీసుల తనిఖీలు.. కారణం ఇదేనట!
- 32 పోలీస్ స్టేషన్ ల పరిధిలో ఉన్న 75 హోటళ్లు, లాడ్జిలు, దాబాల్లో సోదాలు
- రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు పరిశీలన
- అసాంఘిక కార్యకలాపాల కట్టడికి చర్యలు తీసుకున్నామని ఎస్పీ వివరణ
నేరాలకు పాల్పడే వారు, బెట్టింగ్ లు నిర్వహించే వారు, గంజాయి సేవించే వారు, ఇతర పలు అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారు సహజంగా తాత్కాలిక ఆవాసం కోసం వీటిని ఎంచుకుంటారన్నారు. అటువంటి వాటికి చోటివ్వ వద్దనే ప్రధాన ఉద్దేశంతో ఈ తనిఖీలు నిర్వహించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. రెస్టారెంట్లు దాబాలలో ఇతర ప్రదేశాలలో ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ లు ఇతర అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోమని ఎస్పీ హెచ్చరించారు. చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వారు విధిగా పోలీసులకు సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ వివరించారు.