భారతీయ రైతులా డొనాల్డ్ ట్రంప్.. ఆకట్టుకుంటున్న ఏఐ వీడియో ఇదిగో

  • ఏఐ ద్వారా ట్రంప్‌ను వృద్ధ రైతులా సృష్టించిన వైనం
  • సైకిల్ మీద గడ్డి మోపు, చెట్టు కింద కూర్చొన్ని సన్నిహితులతో ముచ్చట్లు పెడుతున్నట్లుగా వీడియో
  • ఏఐ వీడియోపై నెటిజన్ల ప్రశంసలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ రైతుగా ఉంటే ఎలా ఉంటారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా సృష్టించిన ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అగ్రరాజ్య అధినేతను ఏఐ సాంకేతికతతో వృద్ధ రైతుగా రూపొందించారు.

ఈ వీడియోలో ఆయన సైకిల్‌పై గడ్డి మోపును పెట్టుకుని వెళుతున్నట్లు, పొలాల్లో ఆవును కట్టి తీసుకువెళుతున్నట్లు ఉంది. గ్రామంలో చెట్టు కింద స్నేహితులతో ముచ్చటిస్తున్నట్లు, తెల్లని దుస్తుల్లో పిల్లలకు దీపావళి టపాసులు కొనిస్తున్నట్లు కూడా ఏఐ ద్వారా సృష్టించారు.

ఈ వీడియోకు నేపథ్య సంగీతంగా 'బలగం' చిత్రంలోని "తెల్లాతెల్లాని పాలదారలల్లే పల్లె తెల్లవారుతుంటది రా.. గుళ్లోని గంటలు కాడెట్ల మెడలోన జంటగ మోగుతు ఉంటయ్ రా" అనే పాటను జత చేశారు. డొనాల్డ్ ట్రంప్ ఏఐ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


More Telugu News