King Cobras: కింగ్ కోబ్రాల సయ్యాట చూస్తారా.. వీడియో ఇదిగో!

King Cobras Spotted Near Engineering College in Andhra Pradesh
--
ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. స్థానిక కురుపాం ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలోకి రెండు కింగ్ కోబ్రాలు వచ్చాయి. ఒక్కోటి 15 అడుగుల పొడవున్న ఈ పాములు పెనవేసుకుని సయ్యాటలాడుతూ పరిసరాలు మరిచిపోయాయి. డిస్టర్బ్ చేయాలని ఓ టవల్ ను వాటిపైకి విసిరినా పట్టించుకోలేదు. దాదాపు అరగంట పాటు సయ్యాటలో మునిగితేలాయి. 

కొంతమంది ఈ సయ్యాటను తమ సెల్ ఫోన్లలో బంధించారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవికాస్తా వైరల్ గా మారాయి. అయితే, జనావాసాల్లో ఇలాంటి పాములు సంచరించడం ప్రమాదకరమని, వాటిని పట్టుకుని దూరంగా వదిలేసేందుకు స్నేక్ క్యాచర్స్ గాలిస్తున్నారు.


King Cobras
Viral Video
Parvathipuram Manyam District
Andhra Pradesh
Snake Fight Video
King Cobra Dance
Wildlife
Dangerous Snakes
Snake Catchers

More Telugu News