Mithun Reddy: సిట్ విచార‌ణ‌కు హాజ‌రైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి

YCP MP Mithun Reddy Appears Before SIT for Liquor Scam Probe

  • ఈరోజు ఉద‌యం  విజ‌య‌వాడ‌లోని సిట్ కార్యాల‌యానికి వ‌చ్చిన ఎంపీ
  • మద్యం కుంభ‌కోణంలో భారీగా అనుచిత ల‌బ్ధి పొందిన సంస్థ‌ల్లో అదాన్ డిస్టిల‌రీస్
  • ఈ కంపెనీ వెన‌క రాజ్ క‌సిరెడ్డితో పాటు మిథున్‌రెడ్డి ఉన్నార‌న్న విజ‌య‌సాయిరెడ్డి
  • ఆయ‌న వాంగ్మూలం మేర‌కు ఈరోజు మిథున్‌రెడ్డిని విచారించ‌నున్న సిట్ అధికారులు

లిక్క‌ర్ స్కామ్ కేసులో సిట్ విచార‌ణ‌కు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈరోజు ఉద‌యం విజ‌య‌వాడ‌లోని సిట్ కార్యాల‌యానికి వ‌చ్చిన ఆయ‌న‌, ఆ త‌ర్వాత అధికారుల ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. 

అప్ప‌టి సీఎం వైఎస్ జ‌గ‌న్ హ‌యాంలో జ‌రిగిన వేల కోట్ల మద్యం కుంభ‌కోణంలో భారీగా అనుచిత ల‌బ్ధి పొందిన సంస్థ‌ల్లో ఒక‌టైన అదాన్ డిస్టిల‌రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెన‌క రాజ్ క‌సిరెడ్డితో పాటు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఉన్నార‌ని, మాజీ ఎంపీ, వైసీపీ నేత విజ‌య‌సాయిరెడ్డి శుక్ర‌వారం బ‌య‌ట‌పెట్టిన విష‌యం తెలిసిందే. దీంతో నిన్న ఆయ‌న ఇచ్చిన వాంగ్మూలం మేర‌కు మిథున్‌రెడ్డిని ఇవాళ సిట్ అధికారులు విచారించే అవ‌కాశం ఉంది. 

కాగా, వైసీపీ హ‌యాంలో లిక్క‌ర్ స్కామ్ జ‌రిగింద‌ని కూట‌మి ప్ర‌భుత్వం ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. అందులో భాగంగా ద‌ర్యాప్తున‌కు సిట్‌ను ఏర్పాటు చేసింది.

Mithun Reddy
YSR Congress Party
Liquor Scam
SIT Investigation
Vijayawada
Andhra Pradesh
Rajampet MP
Adani Distilleries
Vijay Sai Reddy
Political Corruption
  • Loading...

More Telugu News