Anil Kumble: అనిల్ కుంబ్లేతో డీకే శివకుమార్ మంతనాలు.. రాజకీయాల్లో చేరుతున్నాడా?

Anil Kumbles Meeting with Karnatakas Deputy CM Sparks Debate
           
టీమిండియా దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లేను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా పంచుకున్న శివకుమార్ దేశానికి, రాష్ట్రానికి కుంబ్లే చేసిన సేవలను కొనియాడారు.

దీనికి కుంబ్లే కూడా స్పందించాడు. తనను కలిసేందుకు విలువైన సమయాన్ని వెచ్చించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే, ఈ సమావేశం వెనకున్న కారణాలు తెలియరాలేదు. మరోవైపు, ఇద్దరి కలయికపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. కుంబ్లేను డీకే రాజకీయాల్లోకి ఆహ్వానించారని చెబుతున్నారు. అయితే, కుంబ్లే మాత్రం ఇది వ్యక్తిగత సమావేశమని కొట్టి పడేశాడు.  

   
Anil Kumble
DK Shivakumar
Karnataka Politics
Indian Cricketer
Political Entry
Cricket
Karnataka
India
Meeting
Social Media

More Telugu News