రీల్స్ కోసం ఎంత‌కు తెగించారో.. న‌డి రోడ్డుపై యువ‌తుల అస‌భ్య‌క‌ర‌ డ్యాన్స్.. వీడియో వైర‌ల్‌!

  • పంజాబ్ రాష్ట్రం లూథియానాలో ఘ‌ట‌న‌
  • ఇన్‌స్టా రీల్స్ కోసం అమ్మాయిల‌ ప్ర‌మాద‌క‌ర ప‌నులు 
  • ప‌క్క‌న వాహ‌నాలు వెళుతున్నా ప‌ట్టించుకోకుండా నృత్యం
  • నెట్టింట వైర‌ల్‌గా మారిన వీడియో.. రంగంలోకి దిగిన పోలీసులు
సోష‌ల్ మీడియాలో ఫేమ‌స్ కావ‌డానికి కొంద‌రు అస‌భ్య‌క‌ర‌, ప్ర‌మాద‌క‌ర ప‌నులు చేస్తున్నారు. తాజాగా పంజాబ్ రాష్ట్రం లూథియానాలో ఇద్ద‌రు అమ్మాయిలు రీల్స్ కోసం న‌డి రోడ్డుపై అస‌భ్య‌క‌ర‌ డ్యాన్స్ చేశారు. వారి ప‌క్క నుంచే వాహ‌నాలు వెళుతున్నా ప‌ట్టించుకోలేదు. అటుగా వెళుతున్న ఆటో డ్రైవ‌ర్లు, ప్ర‌యాణికులు వారిని వీడియో తీసి సామాజిక మాధ్య‌మాల్లో పెట్ట‌డంతో వైర‌ల్‌గా మారింది. 

ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం వారు ఒక‌ ఫ్లైఓవర్ కింద ఇలా నృత్యం చేశారు. దాంతో ట్రాఫిక్‌కు అంత‌రాయం క‌లిగి భారీగా వాహనాలు ఆగిపోవాల్సి వచ్చింది. ప్రజలు చూడటానికి గుమిగూడడంతో పెద్ద ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ఈ నేప‌థ్యంలో  స్థానికుల‌ నుంచి ఫిర్యాదులు రావ‌డంతో లూథియానా పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్నారు.  

"రోడ్డు మధ్యలో రీల్స్ చేయడం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన అవుతుంది. మేము వీడియోను ప‌రిశీలిస్తున్నాం. ఆ అమ్మాయిలు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. దర్యాప్తు తర్వాత వారిపై చర్యలు తీసుకుంటాం" అని ఏసీపీ (ట్రాఫిక్) గురుప్రీత్ సింగ్ అన్నారు. ఈ సంఘటన బుధవారం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, న‌డిరోడ్డుపై ఇలాంటి ప‌నులు చేయ‌డంపై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 


More Telugu News