Telangana High Court: గ్రూప్-1 నియామకాలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Telangana High Courts Crucial Orders on Group1 Appointments
  • గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు
  • ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వవద్దన్న హైకోర్టు
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను కొనసాగించవచ్చని స్పష్టీకరణ
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్-1 నియామక ప్రక్రియపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-1 నియామక ప్రక్రియపై విచారణ పూర్తయ్యే వరకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను ఇవ్వవద్దని ఆదేశించింది. అయితే వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను మాత్రం కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.

గ్రూప్-1 ఫలితాలు రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. రెండు సెంటర్లలోనే 74 మందికి ర్యాంకులు వచ్చాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. గ్రూప్-1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. తెలుగు మీడియం విద్యార్థులను నిర్లక్ష్యం చేశారని ఆరోపణలు వచ్చాయి.
Telangana High Court
Group-1 Recruitment
Telangana Group-1 Results
Recruitment Process
Certificate Verification
BRS Party
Telugu Medium Students
High Court Orders
Government Jobs Telangana

More Telugu News