Narendra Modi: ప్రధాని మోదీ అమరావతి పర్యటన ఖరారు.. షెడ్యూల్ వివరాలు!

PM Modis Amaravati Visit Confirmed Schedule Details
  • మే 2న అమరావతికి రానున్న మోదీ
  • ఆరోజు సాయంత్రం 4 గంటలకు రాజధాని పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమం
  • సచివాలయం వెనుక బహిరంగసభ వేదిక ఏర్పాటు
ఏపీ రాజధాని అమరావతిలో ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు. అమరావతి నిర్మాణాల పునఃప్రారంభోత్సవానికి ప్రధాని హాజరుకానున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారయింది. మే 2వ తేదీ అమరావతికి మోదీ రానున్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులను మోదీ ప్రారంభిస్తారు. 

ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వెనుక బహిరంగసభ వేదికను ఏర్పాటు చేయనున్నారు. ఈ వేదిక నుంచే పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మోదీ నిర్వహించనున్నారు. భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తోంది. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

ఈ కార్యక్రమానికి ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల ప్రజలు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించారు. ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. 
Narendra Modi
Amaravati
Andhra Pradesh
India
PM Modi Andhra Visit
Amaravati Development
Modi's Andhra Visit Schedule
Capital City Development
SPG Security
May 2nd

More Telugu News