ఒకే ఓవ‌ర్‌లో 11 బంతులేశాడు.. ఐపీఎల్‌లో రాజస్థాన్ పేస‌ర్ పేరిట చెత్త రికార్డు!

  • నిన్న డీసీతో మ్యాచ్‌లో ఆర్ఆర్ బౌల‌ర్ సందీప్ శ‌ర్మ చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌
  • ఢిల్లీ ఇన్నింగ్స్ ఆఖ‌రి ఓవర్‌లో 11 బంతులేసిన ఫాస్ట్ బౌల‌ర్
  • దీంతో ఐపీఎల్‌లో ఒకే ఓవ‌ర్‌లో 11 బంతులేసిన నాలుగో బౌల‌ర్‌గా అవాంఛిత‌ రికార్డు
  • అంత‌కుముందు తుషార్ దేశ్ పాండే, సిరాజ్, శార్ధూల్ పేరిట ఈ చెత్త రికార్డు
బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్‌) పేసర్ సందీప్ శర్మ 11 బంతుల ఓవర్ వేసి అవాంఛిత‌ రికార్డును త‌న పేరున లిఖించుకున్నాడు. డీసీ ఇన్నింగ్స్ ఆఖ‌రి ఓవర్‌లో సందీప్ 11 బంతులు వేయ‌గా ఇందులో నాలుగు వైడ్‌లు, ఒక నోబాల్ ఉన్నాయి. సిక్సు, ఫోర్‌, నాలుగు సింగిల్స్ క‌లుపుకొని 19 పరుగులు స‌మ‌ర్పించుకున్నాడు. దీంతో ఐపీఎల్‌లో ఒకే ఓవ‌ర్‌లో 11 బంతులు వేసిన నాలుగో బౌల‌ర్‌గా చెత్త రికార్డు న‌మోదు చేశాడు. అంత‌కుముందు తుషార్ దేశ్ పాండే, మ‌హ్మ‌ద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్ కూడా ఒకే ఓవ‌ర్‌లో 11 బంతులు వేసి అవాంఛిత‌ రికార్డు మూట‌గ‌ట్టుకున్నారు. 

ఐపీఎల్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక బంతులు
11 బంతులు - మహమ్మద్ సిరాజ్ వ‌ర్సెస్ (ఎంఐ) బెంగళూరు 2023 (ఓవర్-19)
11 బంతులు - తుషార్ దేశ్‌పాండే వ‌ర్సెస్ (ఎల్ఎస్‌జీ) చెన్నై 2023 (ఓవర్-4)
11 బంతులు - శార్దూల్ ఠాకూర్ వ‌ర్సెస్ (కేకేఆర్‌) కోల్‌కతా 2025 (ఓవర్-13)
11 బంతులు - సందీప్ శర్మ వ‌ర్సెస్ (డీసీ) ఢిల్లీ 2025 (ఓవర్-20)

ఇక నిన్న‌టి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సూప‌ర్ ఓవ‌ర్‌లో విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. మొద‌ట‌ డీసీ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్ఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులే చేయడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. కాగా, స్టార్క్ వేసిన సూపర్ ఓవర్‌లో రాజస్థాన్ 11 ర‌న్స్ మాత్ర‌మే చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని ఢిల్లీ నాలుగు బంతుల్లోనే ఛేదించి సూప‌ర్ విక్ట‌రీని న‌మోదు చేసింది.


More Telugu News