Gold Price: రూ.98,000 దాటిన బంగారం ధర

- ఒక్కరోజులోనే రూ. 1,650 పెరిగిన పసిడి ధర
- హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో రూ.97,700 పలికిన పసిడి
- రూ.1 ,900 పెరిగిన కిలో వెండి ధర
బంగారం ధర సరికొత్త గరిష్ఠ స్థాయికి చేరుకుంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.98 వేలు దాటింది. ఢిల్లీలో ఒక్కరోజులోనే రూ. 1,650 పెరిగి రూ.98,100 ను తాకింది. సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల పసిడి రూ.97,700 కు చేరుకుంది.
వెండి ధర కూడా భారీగానే పెరిగింది. కిలో వెండి రూ. 1,900 పెరిగి రూ.99,400లకు చేరింది. మంగళవారం కిలో వెండి రూ. 97,500 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 3,318 డాలర్లకు చేరుకుంది. గోల్డ్ మన్ శాక్స్ అంచనా ప్రకారం బంగారం ధరలు ఈ ఏడాది చివరి నాటికి రూ. 1.25 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. వాణిజ్య యుద్ధం, ట్రంప్ సుంకాల ప్రభావంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.