Chandrababu: 16వ ఆర్ధిక సంఘానికి రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజంటేషన్
- రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వివరిస్తూ వీడియో ప్రదర్శన
- రాష్ట్ర పురోగతిపై ఫొటో ఎగ్జిబిషన్
- ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించిన సీఎం చంద్రబాబు
రాష్ట్రానికి వచ్చిన 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు నాయుడు వివిధ అంశాలపై వీడియో ప్రజంటేషన్ ఇచ్చారు. వీటిలో ఏపీ ఏపీ వృద్ధికి అనుకూలతలు, స్వర్ణాంధ్ర-2047 విజన్, వినూత్న కార్యక్రమం పీ4 వంటి తదితర అంశాలు ఉన్నాయి.
ఏపీ వృద్ధికి అనుకూలతలు..
అతిపెద్ద తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ తూర్పు దేశాలకు గేట్‌వేగా ఉంది. 3 పారిశ్రామిక కారిడార్లు, విశాఖ-చెన్నయ్, చెన్నై-బెంగళూరు, బెంగళూరు-హైదరాబాద్ కారిడార్లు ఉన్నాయి. 6 పోర్టులు, 7 ఎయిర్ పోర్టులు ఉన్నాయి. దేశ ఎగుమతుల్లో 5.8 శాతం రాష్ట్రం నుంచే అవుతున్నాయి. బ్లూ ఎకానమి, ఐటీ, నాలెడ్జ్ ఎకానమి, క్వాంటమ్ వ్యాలీ, డ్రోన్, ఐఓటీ, బ్లాక్ చెయిన్ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో రాష్ట్రం ముందుంది. గ్రీన్ హైడ్రోజన్, సోలార్, అమోనియా... ఇలా గ్రీన్ ఎనర్జీకి ఏపీ హబ్‌గా ఉంది. అటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలు అమరావతికి చేరువలో ఉన్నాయి. ఈ నాలుగు నగరాలను కలుపుతూ దక్షిణ భారతదేశం మరింత అభివృద్ధి చెందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తే వికసిత్ భారత్ లక్ష్యంలో భాగం అవుతుంది.
స్వర్ణాంధ్ర-2047 విజన్..
భారతదేశాన్ని 2047 కల్లా వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు విజన్ రూపొందించుకున్నాం. హెల్తీ, వెల్తీ, హ్యాపీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. స్వర్ణాంధ్ర-2047 విజన్‌తో పది సూత్రాల ప్రణాళిక అమలు చేస్తున్నాం. ప్రతి కుటుంబానికి కనీస అవసరాలు తీర్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ప్రతి ఒక్క కుటుంబానికి సొంతిళ్లు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, కుళాయి కనెక్షన్, వంటగ్యాస్, సమృద్ధిగా విద్యుత్ సరఫరా, హైస్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అటు గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు, విద్యుత్ ఆదా చేసే వీధి లైట్లు, పాఠశాలలు, ఆరోగ్యకేంద్రాలు బలోపేతం చేసేలా చర్యలు చేపట్టాం.
వినూత్న కార్యక్రమం పీ4..
జీరో పావర్టీ లక్ష్యంగా సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేదలను అత్యున్నత స్థానంలో ఉన్న 10 శాతం మంది సంపన్నులు ఆదుకునే పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సమాజంలో అసమానతలు తొలిగేలా చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. జనాభా వృద్ధిపైనా దృష్టి సారించాం.
స్వర్ణాంధ్ర - 2047 లక్ష్యాలు..
ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధించి 2047 కల్లా 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ అవతరించేలా కృషి చేస్తున్నాం. అలాగే తలసరి ఆదాయం 42,000 వేల డాలర్లకు చేరడంతో పాటు ఎగుమతులు 450 బిలియన్ డాలర్లు, సగటు జీవిత కాలం 85 ఏళ్లు, అక్షరాస్యత 100 శాతం సాధించడం, నిరుద్యోగ రేటు 2 శాతానికి మించకుండా అభివృద్ధి చెందేలా చూస్తున్నాం.
రూ.40 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరం..
ప్రస్తుతం జీఎస్డీపీ రూ. 18.25 లక్షల కోట్లు ఉండగా... 2028-29 నాటికి రూ. 29.29 లక్షల కోట్లకు చేరుకోవాలనేది లక్ష్యం. ఇది సాకారం కావాలంటే 2029 కల్లా రూ.40 లక్షల కోట్ల పెట్టుబడులు రావాల్సి ఉంది.
2014-15 నాటికి వివిధ రంగాల వాటా..
2014లో రాష్ట్ర విభజనతో ఆదాయ వనరులు అన్నీ తెలంగాణకు వెళ్లాయి. కేవలం ప్రాథమికరంగంపైన మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఆధారపడాల్సి వచ్చింది. 2014లో ఏపీకి 31 శాతం ఆదాయం ప్రధానంగా వ్యవసాయ రంగం నుంచి వస్తే, తెలగాణ రాష్ట్రానికి 16 శాతం మాత్రమే ఆదాయం వచ్చింది. అలాగే పరిశ్రమల రంగం నుంచి ఏపీకి 25 శాతం, తెలంగాణకు 22 శాతం, సేవల రంగం నుంచి ఏపీకి 44 శాతం, తెలంగాణ 61 శాతం వాటా ఉంది.
2023-24 నాటికి వివిధ రంగాల వాటా..
2023-24 నాటికి ఏపీ ఆదాయంలో వ్యవసాయరంగం వాటా 34 శాతం ఉంటే, భారతదేశానికి 20 శాతం, తెలంగాణకు 15 శాతం ఉంది. ఏపీలో పరిశ్రమల రంగం వాటా 24 శాతం ఉంటే, భారతదేశంలో 26 శాతం, తెలంగాణలో 18 శాతం ఉంది. ఏపీలో సేవలరంగం వాటా 42 శాతం ఉంటే, భారతదేశంలో 54 శాతం, తెలంగాణలో 67 శాతం ఉంది.
ప్రధాన ఆదాయ వనరు లేదు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది. రాష్ట్ర విభజనతో హైదరాబాద్ ఆదాయం ఏపీ కోల్పోయింది. దీంతో తెలంగాణకు ఆదాయంలో 75 శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది. ఇది తెలంగాణ వృద్ధికి, తలసరి ఆదాయం పెరుగుదలకు, ఏపీ వెనకబాటు తనానికి కారణమైంది.
జీఎస్డీపీలో రాష్ట్ర సొంత ఆదాయం తక్కువ..
దేశంలోని ముఖ్యమైన రాష్ట్రాలతో పోల్చుకుంటే జీఎస్డీపీలో రాష్ట్ర సొంత ఆదాయ వనరుల శాతం ఏపీలో తక్కువగా ఉంది. ఏపీలో 6.48 శాతం ఉంటే, తెలంగాణలో 9.51 శాతం, కేరళలో 8.49 శాతం, మహారాష్ట్రలో 7.93 శాతంగా ఉంది.
విభజనతో నష్టం-పంపకాలు పెండింగ్..
విభజనతో జాతీయ సంస్థలు, విద్య-వైద్య సంస్థలు, భారత ప్రభుత్వ సంస్థలు ఏపీకి లేకుండా పోయాయి. విభజన చట్టం షెడ్యూల్ 9 ప్రకారం 91 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లకు సంబంధించి రూ.1.63 లక్షల కోట్లు, అలాగే షెడ్యూల్ 10 కింద ఉన్న 142 సంస్థలకు చెందిన రూ.39,191 ఆస్తుల పంపంకం అంశం రెండు రాష్ట్రాల మధ్య విభజన జరిగి పదేళ్లవుతున్నా ఇంకా పెండింగ్‌లోనే ఉంది.
తలసరి ఆదాయంలోనూ తలకిందులు..
రాష్ట్రం విడిపోయే నాటికి 2014-15లో ఏపీ తలసరి ఆదాయం రూ. 93,903 ఉంటే, తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104గా ఉండేది. మొదటి ఐదేళ్ల మా పాలనలో ఏపీలో తలసరి ఆదాయం 13.21 శాతం పెరిగి 2019కి రూ. 1,54,031కు చేరుకుంది. అదే కాలానికి తెలంగాణలో 13.37 శాతం పెరిగి రూ. 2,09,848 అయింది. 2019-24 మధ్య ఏపీలో తలసరి ఆదాయ వృద్ధి 9.18 శాతానికి పడిపోయింది. తెలంగాణలో మాత్రం 11.45 శాతం నమోదైంది. దీంతో 2023-24లో ఏపీ తలసరి ఆదాయం రూ. 2,37,951, తెలంగాణ తలసరి ఆదాయం రూ. 3,56,56 నమోదైంది. ఇలా రాష్ట్ర విభజన, గత ప్రభుత్వ విధ్వంసం కారణంగా తలసరి ఆదాయంలో తెలంగాణకు, ఏపీకి వ్యత్యాసం భారీగా పెరిగిపోయింది. దక్షిణ భారత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయమే అత్యంత తక్కువ.
2019-24లో గాడితప్పిన వ్యవస్థ..
గత ప్రభుత్వ హయాంలో ఆర్ధిక క్రమశిక్షణ లేకపోవడం, ఆదాయ వృద్ధిపై దృష్టి పెట్టకపోవడం రాష్ట్రానికి భారీగా నష్టం కలిగించింది. రెవెన్యూ వ్యయంపై ఎలాంటి నియంత్రణ లేదు. 2024లో అధికారం చేపట్టేనాటికి మొత్తం రుణాలు రూ.9.74 లక్షల కోట్లకు ఉంది. దీనికి తోడు గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన బకాయిలు రూ.1.35 లక్షల కోట్లు ఉన్నాయి. మూలధన వ్యయం కూడా 2014-19లో 2.01 శాతం నుంచి 2019-24కి 1.38 శాతానికి తగ్గింది.
ఈ 9 నెలల్లో గాడిలో పెట్టాం..
2024లో అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం మిగిల్చిన రూ. 24,811 కోట్ల బకాయిలు చెల్లించాల్సి వచ్చింది. కేంద్ర ప్రాయోజిక పథకాలకు సంబంధించిన బకాయిలు రూ. 13,085 కోట్లు తీర్చాం. మూలధన వ్యయానికి సంబంధించి రూ. 13,314 కోట్లు చెల్లించాం. స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు రూ. 3,339 కోట్లు ఖర్చు చేశాం. అమరావతి, పోలవరం, ఇండస్ట్రియల్ హబ్, పోర్టుల నిర్మాణం కోసం నిధులు భారీగా ఖర్చు పెడుతున్నాం.
19 కొత్త పాలసీలు తీసుకువచ్చాం..
రాష్ట్రాభివృద్ధి కోసం కొత్తగా 19 పాలసీలు ప్రవేశపెట్టాం. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎంఎస్ఎంఈ, మేరిటైమ్, క్లీన్ ఎనర్జీ, టూరిజం, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీల ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాం.
స్వర్ణాంధ్ర సాకారానికి వృద్ధి రేటే ఆధారం..
స్వర్ణాంధ్ర విజన్ -2047 సాకారం కావాలంటే వృద్ధి రేటు 15 శాతం ఉంటేనే సాధ్యమవుతుంది. 15 శాతం తగ్గకుండా వృద్ధి నమోదు చేయగలిగితే జీఎస్డీపీ రూ. 347 లక్షల కోట్లకు చేరుతుంది. తలసరి ఆదాయం రూ. 58,14,916కు పెరుగుతుంది. అదే 12.50 శాతం వృద్ధి నమోదైతే జీఎస్డీపీ రూ. 214 లక్షల కోట్లు, తలసరి ఆదాయం రూ. 35,85,473 అవుతుంది.
గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్లు..
రాష్ట్రాల్లో గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్లు కేటాయించేటప్పుడు 70 శాతం వెయిటేజీ జనాభాకు, 20 శాతం వెయిటేజీ వ్యవసాయం, అనుబంధ రంగాలకు 10 శాతం వెయిటేజీ ప్రాంతానికి ఇవ్వాలని ప్రతిపాదన. గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు రూ.69,897 కోట్ల నిధులు అవసరం కాగా, రూ.7,381 కోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరో రూ.62,516 కోట్ల నిధులు కావాల్సి ఉంది.
పట్టణ స్థానిక సంస్థలకు గ్రాంట్లు..
పట్టణ, స్థానిక సంస్థల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్యం, రహదారుల నిర్మాణం, అర్బన్ ట్రాన్స్‌పోర్ట్, వీధి లైట్లు, మురుగునీటి పారుదల వ్యవస్థల కోసం రూ. 19,871 కోట్ల గ్రాంట్లు అవసరం అవుతుంది. అలాగే 2026-2031 మధ్య కాలానికి ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు రూ. 16,181 కోట్లు కావాల్సి ఉంది.
ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ..
క్లీన్ ఎనర్జీకి రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాం. 2030 నాటికి 160 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం. దీనికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరం ఉంది. 7.5 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని సీఎం చంద్రబాబు 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్, సభ్యులకు వివరించారు.