Smitha Sabarwal: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. స్మితా సబర్వాల్‌కు పోలీసుల నోటీసులు

Smitha Sabarwal Receives Police Notice in Gachibowli Land Case

  • ఏఐ చిత్రాన్ని ఆమె షేర్ చేశారంటూ నోటీసులు
  • బీఎన్ఎస్ఎస్ 179 సెక్షన్ కింద నోటీసులు
  • మార్చి 31న చిత్రాన్ని రీట్వీట్ చేసిన స్మితా సబర్వాల్

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారిణి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల అడవి విధ్వంసానికి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చిత్రాన్ని ఆమె పంచుకున్నారని చెబుతూ పోలీసులు ఈ నోటీసులు అందించారు.

మార్చి 31వ తేదీన "హాయ్ హైదరాబాద్" అనే ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన చిత్రాన్ని స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. అందులో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) మష్రూమ్ రాక్ వద్ద చాలా బుల్డోజర్లు ఉన్నట్లుగా ఉంది. వాటి ముందు నెమలి, జింక ఉన్నాయి. ఈ చిత్రంపై విచారణ జరిపిన పోలీసులు అది నకిలీ చిత్రమని నిర్ధారించారు.

ఈ నేపథ్యంలో బీఎన్ఎస్ఎస్ 179 సెక్షన్ కింద స్మితా సబర్వాల్‌కు నోటీసులు ఇచ్చినట్లు గచ్చిబౌలి పీఎస్ ఎస్‌హెచ్ఓ మహ్మద్ హబీబుల్లా ఖాన్ తెలిపారు. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 179 కింద ఒక కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి సాక్షులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వారి వాంగ్మూలాన్ని నమోదు చేసే అవకాశం ఉంది.

Smitha Sabarwal
Gachibowli land scam
Telangana Tourism Secretary
IAS officer
Police notice
Artificial Intelligence
Fake image
Hyderabad Central University
BNSS Section 179
Hyderabad
  • Loading...

More Telugu News