Vijay Sivashankar: 70 .. 80 ఎకరాలు అలా పోయాయి: శివశంకర్ మాస్టర్ తనయుడు!

- శివశంకర్ మాస్టర్ పుట్టింది రాజమండ్రిలోనే
- మా తాతయ్య చేసింది అరటిపండ్ల బిజినెస్
- మద్రాస్ లో బిజినెస్ బాగా నడిచేది
- నాన్నకు వెన్నెముక దెబ్బతిందన్న విజయ్ శివశంకర్
కొరియోగ్రాఫర్ గా శివశంకర్ మాస్టర్ కి గల పేరును గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. పది భాషలలో వేల పాటలకు ఆయన నృత్య దర్శకత్వాన్ని అందించారు. అలాంటి ఆయన 2021లో మరణించారు. అలాంటి శివశంకర్ మాస్టర్ గురించి, ఆయన తనయుడు విజయ్ శివశంకర్ మాట్లాడుతూ .. " మా తాతయ్య వాళ్లది రాజమండ్రి .. అక్కడ మాది అరటిపండ్ల బిజినెస్. మా తాతయ్య పూర్తిగా తోట పనిపై ఉండేవారు" అని అన్నారు.
"ఒకానొక సమయంలో ఒక వ్యక్తికి వ్యవసాయ భూమి ఇంతవరకూ మాత్రమే ఉండాలంటూ, ప్రభుత్వం ఒక కొత్త నిబంధనను తెచ్చింది. దాంతో మా తాతయ్య తెలిసినవారి పేరు మీదకి కొంతభూమిని రాయడం జరిగింది. అలా తీసుకున్న భూమిని ఎవరూ తిరిగి ఇవ్వలేదు. అలా వాళ్లు మోసం చేయడం వలన 70 - 80 ఎకరాలు పోయాయి. మద్రాస్ లో బిజినెస్ బాగా సాగడం వలన అంతగా ఎఫెక్ట్ పడలేదు" అని అన్నారు.
" మా నాన్నగారికి చిన్నప్పుడు జరిగిన ఒక ప్రమాదం వలన వెన్నెముక దెబ్బతింది. అప్పటి నుంచి ఆయన కొన్నేళ్ల పాటు మంచానికి పరిమితమై కదలకుండా ఉండిపోయారట. 12వ ఏడు వచ్చేవరకూ నడవలేకపోయేవారు. ఆ తరువాత నిదానంగా నడిపించడం చేశారు. థియేటర్ షోలు చూడటం పట్ల నాన్నగారు ఆసక్తిని చూపేవారట. అక్కడి నుంచే నాన్నకు డాన్స్ పై ఇంట్రెస్ట్ పెరుగుతూ వెళ్లింది" అని చెప్పారు.