Donald Trump: అక్రమ వలసదారులకు ట్రంప్ బిగ్ ఆఫర్.. అది ఏమిటంటే..?

Trump Offers Big Deal to Illegal Immigrants

  • స్వచ్చందంగా వెళ్లిపోయే అక్రమ వలసదారులకు విమాన ఖర్చులతో పాటు కొంత నగదు ఇస్తామన్న ట్రంప్
  • అక్రమ వలసదారులను వెల్లగొట్టడమే తమ ప్రధమ లక్ష్యమని వెల్లడి
  • చట్టవిరుద్దంగా ఉంటూ నేరాలకు పాల్పడుతున్న వారిపై ప్రస్తుతం ఇమిగ్రేషన్ అధికారులు దృష్టి సారించారన్న ట్రంప్

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో పలు దేశాలకు చెందిన వందలాది మంది అక్రమ వలసదారులను అమెరికా నుంచి వారి స్వదేశాలకు పంపించారు. అయితే తాజాగా అక్రమ వలసదారులకు ట్రంప్ ఒక ఆఫర్ ఇచ్చారు. అక్రమంగా ఉంటూ స్వీయ బహిష్కరణ చేసుకోవాలనుకునే వారికి విమాన ఖర్చులతో పాటు కొంత నగదు కూడా అందిస్తామని ట్రంప్ పేర్కొన్నారు.

ట్రంప్ ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో చట్టవిరుద్ధంగా ఉంటూ నేరాలకు పాల్పడుతున్న వారిపై ప్రస్తుతం ఇమిగ్రేషన్ అధికారులు దృష్టి సారించారని పేర్కొన్న ట్రంప్, చట్టవిరుద్ధంగా ఉంటున్న సాధారణ పౌరుల కోసం స్వీయ బహిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశం నుంచి అక్రమ వలసదారులను వెళ్లగొట్టడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అయితే సముచితమని భావిస్తే వారు చట్టపద్ధతిలో వెనక్కి తిరిగి రావడానికి అనుమతి ఇస్తామని కూడా ట్రంప్ తెలిపారు. 

Donald Trump
Illegal Immigration
US Immigration Policy
Deportation
Self-Deportation
Immigration Reform
Trump's Immigration Plan
America
Illegal Aliens
  • Loading...

More Telugu News