Melinda Gates: విడాకులపై మెలిండా గేట్స్ స్పందన ఇలా..

Melinda Gates Speaks Out About Her Divorce from Bill Gates

  • మొదటిసారి బిల్ గేట్స్‌తో విడాకులపై స్పందించిన మెలిండా ఫ్రెంచ్ గేట్స్
  • అత్యంత సన్నిహిత బంధంలో విలువలతో జీవించలేని పరిస్థితి ఎదురైతే విడాకులు తప్పనిసరి అని వ్యాఖ్య
  • ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నానని వెల్లడి

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న మెలిండా ఫ్రెంచ్ గేట్స్ మొదటిసారిగా తమ విడాకులపై స్పందించారు. బిల్ గేట్స్, మెలిండా ఫ్రెంచ్ గేట్స్ 1994లో వివాహం చేసుకోగా, 27 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 2021లో పరస్పర అంగీకారంతో విడిపోయారు. అయితే దీనిని బిల్ గేట్స్ తన జీవితంలో అతిపెద్ద విచారంగా పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలపై ఇంతవరకూ స్పందించని మెలిండా ఫ్రెంచ్ గేట్స్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడారు. మెలిండా తన మాజీ భర్త బిల్ గేట్స్ వ్యాఖ్యలపై నేరుగా స్పందించకపోయినా పరోక్షంగా సమాధానమిచ్చారు. బిల్ గేట్స్ వ్యాఖ్యలపై తాను మాట్లాడనని స్పష్టం చేసిన మెలిండా, అత్యంత సన్నిహిత బంధంలో విలువలతో జీవించలేని పరిస్థితి ఎదురైతే విడాకులు తప్పనిసరి అని పేర్కొన్నారు.

ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నానని మెలిండా చెప్పారు. నిజానికి విడాకులు అనేది భావోద్వేగ భారం అని అన్నారు. ఆ సమయంలో తాను ఎంతో తీవ్ర భయాందోళనకు గురైనట్లు చెప్పారు. వివాహ బంధాన్ని విడిచిపెడుతున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆ సమయంలో జరిగే చర్చలన్నీ కఠినంగా ఉంటాయని చెప్పారు.

2014లో గేట్స్‌తో కలిసి భోజనం చేస్తున్నప్పుడు అలాంటి బాధ, తీవ్ర భయాందోళనలు కలిగాయన్నారు. తాను గుర్తించిన కొన్ని కష్టమైన విషయాలను ఎదుర్కొన్నానని, అందువల్ల తనకు విడిపోవడం తప్పనిసరి అయిందని మెలిండా తమ విడాకులు తీసుకోవడానికి గల కారణాలను వివరించారు. 

Melinda Gates
Bill Gates
Divorce
Melinda French Gates
Microsoft
Billionaire Divorce
Celebrity Divorce
Relationship Issues
Marriage Breakdown
  • Loading...

More Telugu News