సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంలు విడతలవారీగా మూసివేత!
- ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు
- 60 రైళ్లను ఇతర స్టేషన్లకు మార్చినట్లు వెల్లడి
- ఈరోజు నుంచి విడతలవారీగా మూసివేత
ఈ రోజు నుంచి 5, 6 ప్లాట్‌ఫాంలను 13 రోజుల పాటు, ఆ తర్వాత 3, 4 ప్లాట్‌ఫాంలను మరో 50 రోజుల పాటు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి టర్మినళ్లకు 30 రైళ్లను దారి మళ్లించగా, ఇతర టర్మినల్స్ నుంచి చర్లపల్లి స్టేషన్‌కు 8 రైళ్లను మార్చినట్లు అధికారులు పేర్కొన్నారు.