M.K. Stalin: స్టాలిన్ కీలక నిర్ణయం... రాష్ట్ర స్వయంప్రతిపత్తిపై సూచనలకు కమిటీ

- గవర్నర్‌తో విభేదాల నేపథ్యంలో స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయం
- స్వయంప్రతిపత్తి కోసం తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేయనున్న కమిటీ
- పెండింగు బిల్లులపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయం
వివిధ అంశాలపై కేంద్ర ప్రభుత్వం, గవర్నర్‌తో విభేదాలు నెలకొన్న నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర స్వయంప్రతిపత్తిపై సూచనలు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. స్వయంప్రతిపత్తి కోసం తీసుకోవాల్సిన చర్యలను ఆ కమిటీ సిఫార్సు చేయనుంది.
పలు బిల్లుల ఆమోదంపై తమిళనాడు గవర్నర్, ప్రభుత్వానికి మధ్య విభేదాలు ఉన్నాయి. గవర్నర్ ఆమోదం లేకుండానే 10 చట్టాలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ బిల్లులపై సుప్రీంకోర్టులో సైతం స్టాలిన్ ప్రభుత్వానికి ఊరట లభించింది.
పెండింగులో పెట్టిన 10 బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్టే భావించాలని భారత అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో వాటికి చట్టబద్ధమైన హోదా కల్పిస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం స్వయంప్రతిపత్తిపై సూచనల కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం.