Revanth Reddy: అలా చేస్తే ఊరుకునేది లేదు: సొంత పార్టీ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి హెచ్చరిక

- పార్టీ గీత దాటితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని స్పష్టీకరణ
- పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ అని హితవు
- మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అన్న ముఖ్యమంత్రి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేలకు హెచ్చరిక జారీ చేశారు. పార్టీ గీత దాటితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో జరుగుతున్న కాంగ్రెస్ శాసనసభా పక్షం(సీఎల్పీ) సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీకి ఇబ్బంది కలిగించాలని ఎవరైనా చూస్తే వారే ఇబ్బంది పడతారని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ అని గుర్తించాలని హితవు పలికారు.
మంత్రి వర్గ విస్తరణపై అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని అన్నారు. ఈ విషయంలో ఎవరేమి మాట్లాడినా ఉపయోగం ఉండదని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేలు రేపటి నుంచి గ్రామాల్లో పర్యటించాలని సూచించారు. తాను కూడా మే ఒకటో తారీఖు నుంచి ప్రజల్లోకి వెళతానని అన్నారు. మొన్నటి వరకు మనపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ విమర్శలు చేసేవారని, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా రంగంలోకి దిగారని అన్నారు. తెలంగాణ పథకాలతో మోదీ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోందని వ్యాఖ్యానించారు.