స‌ల్మాన్‌ను బెదిరించిన వ్య‌క్తిని గుర్తించిన‌ ముంబ‌యి పోలీసులు.. తీరాచూస్తే అత‌డు...

  • నిన్న ముంబయిలోని వర్లీ రవాణా శాఖ వాట్సాప్ నంబర్‌కు మేసేజ్‌
  • సల్మాన్‌ను ఇంట్లోనే చంపుతాం లేదా కారులో బాంబు పెట్టి పేల్చేస్తామ‌ని ఆగంత‌కుల సందేశం 
  • ఆ మేసేజ్ పంపిన వ్య‌క్తిని వ‌డోద‌ర‌కు చెందిన ఓ మాన‌సిక రోగిగా గుర్తించిన పోలీసులు
బాలీవుడ్ ఖాన్ త్ర‌యంలో ఒక‌రైన‌ స‌ల్మాన్ ఖాన్‌కు సోమ‌వారం మ‌రోసారి ఆగంత‌కుల‌ నుంచి తీవ్ర బెదిరింపులు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. "స‌ల్మాన్... నిన్ను ఇంట్లోనే చంపుతాం, లేదంటే నీ కారుని బాంబు పెట్టి పేల్చేస్తాం" అని ముంబయిలోని వర్లీ రవాణా శాఖ వాట్సాప్ నంబర్‌కు ఓ సందేశం వ‌చ్చింది.  

దాంతో వర్లీ పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు, బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో ఆ మేసేజ్ పంపిన వ్య‌క్తిని పోలీసులు తాజాగా గుర్తించారు. గుజ‌రాత్ రాష్ట్రం వ‌డోద‌రకు చెందిన 26 ఏళ్ల‌ వ్య‌క్తే స‌ల్లూ భాయ్‌ను బెదిరిస్తూ సందేశం పంపిన‌ట్లు చెప్పారు. 

అయితే, అత‌డు మాన‌సిక రోగి అని, ప్ర‌స్తుతం చికిత్స తీసుకుంటున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. కాగా, గ‌తంలో స‌ల్మాన్‌ను చంపుతామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప‌లుమార్లు బెదిరించిన విష‌యం తెలిసిందే.


More Telugu News