Narayan Bird: కరీంనగర్ లో కనువిందు చేసిన నారాయణ పక్షి

--
అరుదైన జాతికి చెందిన నారాయణ పక్షి సోమవారం కరీంనగర్ లో కనిపించింది. నలుపు, బూడిద రంగు రెక్కలు, పొడవాటి కాళ్లు, ముక్కు ఉన్న ఈ పక్షి యూరప్, ఆసియా, ఆఫ్రికా ఖండాలలో ఎక్కువగా కనిపిస్తుందని జంతుశాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. సాధారణంగా ఇవి చిత్తడి నేలలు, నదులు, సరస్సుల తీర ప్రాంతాల్లో నివసిస్తాయని తెలిపారు. వ్యవహారికంగా నారాయణ పక్షిగా పిలిచే ఈ పక్షి శాస్త్రీయనామం ఆర్డియా సినిరియా అని కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ, పీజీ కళాశాల జంతుశాస్త్ర విభాగాధిపతి కిర్మణయి వెల్లడించారు.