Chandrababu Naidu: ఓ దళిత బైక్ మెకానిక్ కు చంద్రబాబు ఆత్మీయ భరోసా... వీడియో ఇదిగో!

Chandrababu Naidu Assures Dalit Bike Mechanic

  • గుంటూరు జిల్లా పొన్నెకల్లులో సీఎం చంద్రబాబు పర్యటన
  • ఓ దళిత బైక్ మెకానిక్ తో ఆత్మీయ సంభాషణ
  • అక్కడిక్కడే కలెక్టర్ కు ఆదేశాలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా పొన్నెకల్లులో ఎస్సీ కాలనీలో పర్యటించారు. స్థానికంగా ప్రవీణ్ అనే యువకుడి బైక్ రిపేర్ షాప్ కు వెళ్లారు. బైక్ మెకానిక్ ప్రవీణ్ ను ఆత్మీయంగా పలకరించారు. అతని స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు.

సరైన టూల్స్ లేకుండా మెకానిక్ పని ఎలా చేస్తావు? షెడ్ ఈ విధంగా ఉంటే ఎక్కువ మంది ఎలా వస్తారు? అని ఆ యువకుడిని సీఎం చంద్రబాబు అడిగారు. అందుకే మరో చోట షాప్ పెట్టించి, నీకు మంచి టూల్స్ కూడా ఇస్తాం అని తెలిపారు.

వెంటనే జిల్లా కలెక్టర్ ను పిలిచారు. యువకుడు ప్రవీణ్ కు మరో మంచి ప్లేస్ లో బైక్ మెకానిక్ షెడ్ కట్టించి, సరైన పనిముట్లు అందించాలని ఆదేశించారు. అతడికి స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ ఇప్పించాలని స్పష్టం చేశారు. ఇల్లు కూడా మంజూరు చేయాలన్నారు. 


Chandrababu Naidu
AP CM
Dalit
Bike Mechanic
Guntur
Ponnekal
SC Colony
Skill Development
Financial Aid
Praveen
  • Loading...

More Telugu News