Nani: గూస్ బంప్స్ తెప్పిస్తున్న నాని 'హిట్‌-3' ట్రైల‌ర్

Hit 3 Trailer Nanis Powerful Performance

  • నాని, శైల‌ష్ కొల‌ను కాంబోలో 'హిట్‌-3'
  • మే 1న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమా
  • ముమ్మ‌రంగా ప్ర‌మోష‌న్స్ చేస్తున్న మేక‌ర్స్
  • తాజాగా మూవీ ట్రైల‌ర్ ను విడుద‌ల చేసిన చిత్ర‌బృందం

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా శైల‌ష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా మూవీ 'హిట్‌-3'. హిట్ యూనివ‌ర్స్‌లో వ‌స్తున్న మూడో చిత్రం కావ‌డంతో ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. ఇంత‌కుముందు వ‌చ్చిన రెండు మూవీలు భారీ విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. 

ఇక మే 1న 'హిట్‌-3' ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను ముమ్మ‌రం చేశారు. అందులో భాగంగా తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. వరుస హత్యలు... వాటిని ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ అధికారి అయిన‌ అర్జున్ స‌ర్కార్‌ ఎలా చేధించాడు అనే కోణంలో ఈ చిత్రం తెర‌కెక్కిన్న‌ట్లు ట్రైల‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది. ఇందులో నాని చెప్పిన డైలాగ్‌లు థియేట‌ర్లో గూస్ బంప్స్ తెప్పించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మొత్తంగా ట్రైల‌ర్ అదిరిపోయింది. మూవీపై ఉన్న అంచ‌నాల‌ను అమాంతం పెంచేసింది. హిట్ 1, 2తో పోలిస్తే 'హిట్‌-3' వైల్డ్ గా ఉంద‌నే చెప్పాలి. 

ఈ చిత్రంలో నేచుర‌ల్ స్టార్ స‌ర‌స‌న కేజీఎఫ్ ఫేమ్‌ శ్రీనిధి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు. మిక్కీ జే మేయ‌ర్ బాణీలు అందిస్తున్నారు. నాని సొంత నిర్మాణ‌ సంస్థ‌ వాల్‌పోస్టర్‌ సినిమా, యునానిమస్‌ ప్రొడక్షన్స్ పై ప్రశాంతి త్రిపురనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Nani
Hit 3
Hit Universe
Shilpa Shetty
Sailesh Kolanu
Telugu Movie
Thriller
Action
Mickey J Meyer
Tollywood
  • Loading...

More Telugu News