ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టిక.. టాప్ లో ఉన్న జట్టు ఇదే!
--
ఆదివారం నాటికి ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఐదు మ్యాచ్ లు మాత్రమే ఆడాయి. ఇక మూడో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నాలుగో స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్లు నిలిచాయి. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు ప్లేఆఫ్స్ కు చేరతాయనే విషయం తెలిసిందే. ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్ లలో మాత్రమే గెలిచాయి. నెట్ రన్ రేట్ కారణంగా ఈ మూడు జట్లలో ముంబయి ఇండియన్స్ జట్టు ముందుంది.