Ali Khan Tareen: పాలస్తీనాకు ముల్తాన్ సుల్తాన్స్ జట్టు సంఘీభావం.. సిక్సర్‌కు లక్ష చొప్పున విరాళం

ఇజ్రాయెల్‌తో యుద్ధంతో చితికిపోతున్న పాలస్తీనాకు పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లోని ముల్తాన్ సుల్తాన్స్ జట్టు ఫ్రాంచైజీ సంఘీభావం ప్రకటించింది. ఇందులో భాగంగా పీఎస్ఎల్‌లో తమ ఆటగాళ్లు కొట్టే ప్రతి సిక్సర్‌కు, బౌలర్లు తీసే ప్రతి వికెట్‌కు లక్ష పాకిస్థాన్ రూపాయల (భారత కరెన్సీలో రూ. 30,683) చొప్పున పాలస్తీనాలోని స్వచ్ఛంద సంస్థలకు విరాళం ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆ జట్టు యజమాని అలీఖాన్ తరీన్ వెల్లడించారు. పీఎస్ఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు అలీఖాన్ ఓ వీడియో ప్రకటన ద్వారా ఈ విషయాన్ని తెలిపారు.
‘‘పాలస్తీనాకు అండగా నిలవాలని మేము (ముల్తాన్ సుల్తాన్స్) నిర్ణయించాం. అందులో భాగంగా అక్కడి చారిటీలకు విరాళం అందిస్తాం. బ్యాటర్లు కొట్టే ప్రతి సిక్సర్‌కు రూ. లక్ష, బౌలర్ తీసే ప్రతి వికెట్‌కు రూ. లక్ష చొప్పున అందించాలని నిర్ణయించాం’’ అని తరీన్ పేర్కొన్నారు.